పెద్దపల్లి : పురపాలక సంఘ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు మరియు సిబ్బందికి రాగినేడు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు టీకాలు వేశారు. ఈ సందర్భంగా కమీషనర్ తిరుపతి మాటలాడుతూ కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభమైన దృష్యా ఫ్రెంట్ లైన్ వారియర్స్ అయిన మున్సిపల్, పారిశుధ్య కార్మికులకు కరోనా టీకాలు వేయించినట్లు తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా టీకాలు వేసుకోవాలన్నారు. పట్టణ ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని, బయటకు వెల్లినప్పుడు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ సతీష్,సీనియర్ అసిస్టెంట్లు కరుణాకర్, భాస్కర్,జనార్ధన్,సీనియర్ అకౌంటెండ్ సంతోష,బిల్ కలెక్టర్లు,సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి,పులిపాక రాజు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement