Saturday, November 23, 2024

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి – జూలపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌

జూలపల్లి: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు తీసుకుంటు-న్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని జూలపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌ పేరొ్కన్నారు. బుధవారం మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌లో భాగంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎవరైనా మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని, అనుమతులు లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో, కూరగాయల మార్కెట్‌లో గుంపులు గుంపులుగా ఉండవద్దని, భౌతిక దూరం పాటించాలని, శాని-టైజర్‌ ఉంచుకోవాలని సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఏప్రిల్‌ 30 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎస్‌ ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement