ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిలువేరు రవీందర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవీందర్ మృతితో బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది. అందరితో చనువుగా ఉండే రవీందర్ సౌమ్యుడుగా పేరు పొందారు. గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాలకు చెందిన 102 మంది ఆర్యవైశ్యులు వాసవి కన్యక పరమేశ్వరి దర్శనానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని పలు ఆలయాలకు వెళ్లి వచ్చారు. వారిలో చాలా మంది కరోనా బారిన పడగా రవీందర్ కూడా యాత్రకు వెళ్లిన వారిలో ఉన్నాడు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్‌లో ఉండి ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు సూచించిన మందులు వాడాడు. 4 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్ తరలించి చికిత్స చేస్తుండగా వ్యాధి తీవ్రతతో మరణించాడు. ఆయన మృతదేహాన్ని ప్రత్యేక బృందంతో అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకు వచ్చి నేరుగా స్మశాన వాటికలో దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement