Tuesday, November 26, 2024

కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలి..

వేములవాడ: మిగులు బడ్జెట్‌ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చకపోవడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు సంగ స్వామి యాదవ్‌ మండిపడ్డారు. పక్కనే ఉన్న ఏపీలో ప్రభుత్వం ఏడాదిగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీతో అందిస్తుందని, మరి ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం కోసమే ఉందన్నారు. కరోనా వచ్చిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని చెప్పిన కేసీఆర్‌ అతనికి కరోనా వచ్చినప్పుడు యశోద ఆస్పత్రిలో చూపించుకోవడం ఎంతవరకు సబబు అన్నారు. బెడ్లు దొరకక తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యం అందించకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement