Thursday, November 21, 2024

మండలంలో విజృంభిస్తున్న కరోనా..

ఎల్లారెడ్డి పేట : మండలంలోని పలు గ్రామాలలో కరోనా విజృభిస్తుంది. 23 మందికి కరోనా సోకి నట్లు వైద్యాధికారి ధర్మా నాయక్‌ తెలిపారు. కరోనా రెండవ వేవ్‌ తీవ్రంగా ఉంటుందని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా గ్రామాలలో కొవిడ్‌ నిబందనలు పాటించకుండా ప్రజలు విచ్చల విడిగా తిరుగుతూనే వున్నారు. కరోనాను కట్టడి చేయ వలసిన గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. మండలంలోని గొల్లపల్లి లో 7,ఎల్లారెడ్డి పేటలో5,సింగారం 5,కిషన్‌ దాస్‌ పేటలో2,అల్మా ష్‌ పూర్‌ లో2,రజన్నపేటలో 1,నారాయణ పూర్‌ లో 1 కరోనా కేసులు నమోదు అయ్యాయి.మండలంలోని మద్యం, కళ్ళు విక్రయ కేంద్రాలు,బెల్ట్‌ షాపులు,పర్మిట్‌ రూవ్లుు,హోటళ్ళు,బస్టాండ్‌ కూడళ్లు,ఆటోలు,బస్‌ లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని ప్రజలు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు .కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు కఠినంగా అమలు చేసి కరోనా కట్టడికి కృషి చేయాలని గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ శాఖల అధికారులను,నాయకులను ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement