Thursday, December 12, 2024

KNR | జూట్ బ్యాగ్ తో వస్తే కొత్తిమీర ఫ్రీ

ప్లాస్టిక్ వద్దు…. పర్యావరణం ముద్దు
మంథనిలో వ్యాపారి సరికొత్త ఆలోచన


మంథని, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జూట్ బ్యాగ్ తో కూరగాయల కొనుగోలుకు వస్తే కొత్తిమీర ఫ్రీ గా అందిస్తానని ఓ వ్యాపారి ముందుకు వచ్చాడు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో మణికంఠ వెజిట‌బుల్ దుకాణ యజమాని కొత్త శ్రీనివాస్ ప్లాస్టిక్ పర్యావరణానికి కీడు చేస్తుందని, ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అని, ప్లాస్టిక్ కవర్ వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు.

బుధవారం కొత్త శ్రీనివాస్ సరికొత్త ఆలోచనకు నాంది పలికారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్లాస్టిక్ కు బదులుగా ఏదైనా బట్ట సంచి పట్టుకొని వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తన వంతుగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించేందుకు కృషి చేస్తున్నానన్నారు. కూరగాయల వ్యాపారి సరికొత్త ఆలోచనను వినియోగదారులు అభినందించారు. సంచితో వచ్చిన వినియోగదారులకు ఆయనే స్వయంగా కొత్తిమీర అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement