గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనల అమలుతో పాటు కార్మికులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. రూ. 50లక్షల బీమా, స్పెషల్ ఇన్సెంటివ్తో కూడిన మూడు రోజుల సెలవులు తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎరుకల నాగరాజు, ఆస్పత్రి సిబ్బంది దుర్గ ప్రసాద్, మహేష్, సూర్యనారాయణ, కనకరాజు, సాయికుమార్, సాయి కృష్ణ, విజయ్, రేణుక, దుర్గ ప్రసాద్, వంశీ, శ్యామల, ప్రవీణ్, సాయికుమార్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement