Saturday, November 23, 2024

భవన కార్మికులకు రూ. 6 లక్షల బీమా…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ సొంత ఖర్చులతో ఆరు లక్షల రూపాయల బీమా పాలసీలు అందజేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి కార్మికుడు న్యాక్ ద్వారా ఇస్తున్న శిక్షణలో తన నైపుణ్యాన్ని పెంపొందించుకొని, మన దగ్గరనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలన్నారు. మేస్త్రి, సెంట్రింగ్, ప్లంబర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, ఒడ్డెర, వెల్డర్స్ ఇలా భవన నిర్మాణంలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు లేబర్ కార్డు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. కార్మికులు కొంత ఆశ్రద్ధతో కార్డు తీసుకోకపోతే అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకుండా పోతుందని, ఈ సదస్సుకు వచ్చిన ప్రతి కార్మికుడికి నేనే డబ్బులు కట్టి లేబర్ కార్డు ఇప్పిస్తానన్నారు.

అంతేకాకుండా కార్మికులు కూడా ఎప్పటికప్పుడు భవన నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులను గ్రహించి తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకునే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం న్యాక్ ద్వారా ఉచితంగా ఇవ్వడమే కాకుండా, శిక్షణ సమయంలో భత్యం కూడా ఇస్తుందని, ఈ అవకాశాన్ని కార్మికులందరూ ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలని సూచించారు. సమావేశంకు వచ్చిన కార్మికులకు అప్పటికప్పుడే లేబర్ కార్డు యొక్క ఫారం అందజేసి, వాటిని మీసేవ వారికి డబ్బులు ఇచ్చి ఆన్లైన్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు బండారి స్రవంతి-శ్రీనివాస్, బాలాజీ రావు,పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ పుదరి చంద్ర శేఖర్,మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ చందర్ రావు, తిప్పారపు దయాకర్, గుడుగుల సతీష్, రమేష్,శంకరయ్య,వెన్నం రవి, పల్లె మధు, విక్రమ్, ప్రేమ్,నట్రాజ్, మనోజ్,శ్రీనివాస్,చిట్టిబాబు, శ్రీకాంత్,తక్దీర్, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement