డిఫెన్స్ అకాడమీ/ పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న కరీంనగర్ కు చెందిన కానిస్టేబుల్ రాజును సస్పెండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు . కానిస్టేబుల్ రాజు దీర్ఘకాలికల సెలవులో ఉండి డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్లలో నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా గత కొంతకాలం నుండి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి ఇతర ప్రైవేటు (వ్యాపార) కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగినది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్లలో కానిస్టేబుల్ రాజుకు ఎలాంటి సంబంధం లేదు.