Monday, September 23, 2024

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు : కోరుకంటి చందర్

తెలంగాణ వరప్రదాయణి సింగరేణి సంస్థను నిర్వార్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలను పన్నుతుందని రామగుండం శాసనసభ్యులు, తెరాస జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు. సోమవారం ఆర్జీ 2 వకిల్ పల్లి మైన్ వద్ద జరిగిన గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి సంస్థ పురోగతి సాధించిందని, లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ బోర్డు బ్లాకులను వేలం వేయవద్దని గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రావడం జరిగిందన్నారు. లాభాల్లో నడుసున్న సింగరేణిని నష్టాల్లో చూపించి 4 బోగ్గు బ్లాకులను వేలం వేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బోగ్గు బ్లాకులను వేలం వేసే నిర్ణయం తీసుకున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ది తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని, లేందటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి అమోదం పొందాలని ఆర్టీకల్ 368. 2 అంశంలో ఉందన్నారు. అలా కాకుండా 4 బోగ్గు బ్లాకుల‌ను వేలం వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికన్నాలంతా కన్నెరచేశారని, సమ్మె బాట పట్టారన్నారు. పార్లమెంట్ సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత సింగరేణి సంస్థ, కార్మికుల సమస్యలతో మాట్లాడబోతున్నరని అన్నారు. కార్మికులంతా ఒకతాటిపై ఉండి సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం మరో మలిదశ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలన్నారు. సింగరేణి కార్మికులకు అండగా తాముంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement