సుల్తానాబాద్: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకు పిలుపునివ్వడంతో పోలీసులు నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ నియంత పాలనకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌లో యువతకు నిరుద్యోగ భృతి చెల్లింపులో కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వర ప్రదీప్, దున్నపోతుల రాజయ్య, చింతల రాజు, నిషాద్ రఫిక్, మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎండి ముబిన్, దేవేంద్ర కుమార్, మధు, శంకర్, హేమన్ రాజ్, కిరణ్, తాతా కుమార్, చంద్రయ్య, రమేష్, సంపత్, జీవన్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement