ముత్తారం: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ నాయకులను మండలం కేంద్రంలో సోమవారం ఎస్‌ఐ చంద నరసింహరావు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గాదం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయని ఆశతో నిరుద్యోగ యువత కెసిఆర్‌కు అధికారం అప్పగిస్తే కేవలం తన కుటు-ంబంలోని నలుగురు మాత్రమే ఉద్యోగాలు పొందారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ ధీనమైన స్థితిలో ఉన్నారని, ఇప్పటి-కై-నా కళ్ళు తెరిచి కేసీఆర్ నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించేలా నోటిఫికేషన్లు జారీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, యువజన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కోల విజయ్, ఉపాధ్యక్షుడు అనుము లక్ష్మణ్, గుడి రాములు, దాసరి చంద్రమౌళి, అలగం సంపత్, వెల్మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కెక్కెర్ల మహేశ్ గౌడ్ తదితరులున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement