Thursday, November 14, 2024

Peddapalli | రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం… విజయ రమణారావు

పెద్దపల్లి రూరల్, నవంబర్ 9(ఆంధ్రప్రభ): రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, అందుగులపల్లి, బ్రాహ్మణపల్లి, రాగినేడు, కనగర్థి, కాపులపల్లి, కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం, బొంపెళ్లి, మేరపల్లి గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వడ్లు ఎలాంటి కటింగ్ లేకుండా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని రైతులు భరోసాగా ఉండాలని తెలిపారు. దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిని రైతుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్న వడ్లకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనలు మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు.

తడిసిన, మొలకెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిలర్లతో మాట్లాడి సపరేటుగా మద్దతు ధరకు కొనుగోలు చేయించే భాధ్యత నాదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 1010, 64, 118 రకాల యాసంగికి అనుకూలమన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజా పాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు క్. కార్యక్రమాల్లో మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, ఐకెపి ఏపిఎం సంపత్, నా విండో సిఈఓ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement