ఆస్కార్ సాదించి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చారు, అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలోనూ హైదరాబాద్ ఖ్యాతి దశదిశల వ్యాపిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని, ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
RRR చిత్ర బృందానికి ఈటల అభినందనలు
RRR చిత్ర బృందానికి ఈటల రాజేందర్ అభినందనలు తెలిపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకున్న “నాటు నాటు” పాట రచయిత చంద్రబోస్ కి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి, గాయకులు రాహుల్ సింప్లిగంజ్, చిత్ర దర్శకులు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరన్, నిర్మాత డి.వి.వి దానయ్య, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలుగు, భారత సినిమాకు దక్కిన అని, ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.