Saturday, September 7, 2024

KNR: సమస్యలుంటే ఫిర్యాదు చేయండి.. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్

ప్రజలు సమస్యలుంటే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ తెలియజేశారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గంజాయితో పాటు డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా చర్యలు తప్పవన్నారు. డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చంద్రమోహన్ కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement