- త్యాగాలకు గుర్తుగా ఘన నివాళులు
- రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
గోదావరిఖని : పోలీస్ అమరవీరుల సంస్మరణలో కార్యక్రమాలు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులర్పిస్తామని సీపీ వివరించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డే ద్వారా సంస్మరణ కార్యక్రమాలను జరుపుతున్నామన్నారు. అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తదితర విషయాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా కేటగిరి-1 స్టూడెంట్స్‌కు, ఇంటర్మీడియట్ వరకు రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర, కేటగిరి-2 డిగ్రీ, ఆపై విద్యార్థులకు సైబర్ కైమ్ నివారణలో పోలీసు, పౌరుల పాత్ర- అనే అంశాలపై ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ-లు నిర్వహించి మొదటి ముగ్గురికి ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కేటగిరి-1 కానిస్టేబుల్ అధికారి నుండి ఏఎ స్‌ఐ స్థాయి అధికారి వరకు పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయాల్సిన కృషి, కేటగిరి-2 ఎస్‌ఐ స్థాయి అధికారి, పై స్థాయి అధికారులకు సమర్ధవంతమైన పోలీసింగ్‌లో మహిళ పోలీస్‌ల పాత్ర, రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, పోలీస్ అమరవీరుల కుటు-బాలను కలిసి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులర్పిస్తామన్నారు. లఘు చిత్రాలు, ఫోటోల పోటీ-లు పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపేలా తక్కువ విడిది గల షార్ట్ ఫిలిమ్స్, ఈ మధ్య తీసిన ఫోటోలు, ఆర్టికల్‌లపై ఈనెల 25లోగా స్పెషల్ బ్రాంచ్‌లో అందించాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా ఫోన్ నెంబర్ 8712656596లో సంప్రదించాలన్నారు. 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలిపేలా పోలీస్ కళా బృందంతో పాటల ప్రదర్శన ఉంటుందన్నారు. 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణలో ఘనంగా నివాళులర్పిస్తూ స్మృతి పరేడ్, పోలీస్ ఫ్లాగ్ డే తదితర కార్యక్రమాలు నిర్వహస్తామని సీపీ తెలిపారు.
21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement