పెద్దపల్లిరూరల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఆందోళన నిర్వహించారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పూసాల రమేశ్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునిల్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం రూ. 9వేల ఇవ్వాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రతి నెలా 5వతేదీలోపు మెస్, గౌరవ వేతన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, పనికి భద్రత, ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించి గ్యాస్ సరఫరా చేయడంతోపాటు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో ధరణి సుమలత, ఎనగంటి పద్మ, గుండ రమాదేవి, గుట్ల మల్లేశ్వరితోపాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement