పెద్దపల్లి, మే 20 (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆపద సమయంలో సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలిచి ఆదుకుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 191 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.61లక్షల 24వేల 100 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పేద ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారన్నారు.
అనారోగ్యం పాలైన, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు, ఇతర కారణాలతో చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో భరోసా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, పీఏసీఎస్ ఛైర్మెన్లు, ఏఎంసీ ఛైర్మెన్లు, డైరెక్టర్ లు, పట్టణాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.