Tuesday, November 19, 2024

ఆపద వేళ అండగా సీఎంఆర్‌ఎఫ్ – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, ప్రభ న్యూస్‌ : రాష్ట్రంలోని పేదలకు ఆపద సమయంలో సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 146 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 55.61లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల సంక్షేమం కొసం అనేక పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటుందన్నారు. ఆపదలో ఉన్న సమయంలో వైద్యానికి ఖర్చులు లేని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికంగా భరోసా ఇస్తున్నారన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారు, అనారోగ్యానికి గురైన, వ్యాధుల బారిన పడ్డ పేదల ప్రజలు వైద్యం చేయించుకునే స్థోమత లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిరంతరం పేదల పక్షాన నిలుస్తూ వారి సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్‌లు, పట్టణ అధ్యక్షులు, అనుబంధ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, కో- ఆప్షన్‌ సభ్యులు, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement