ధర్మారం, (ప్రభన్యూస్): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలా మారిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం ధర్మారం మండల పరిషత్ సమావేశ మందిరంలో 70 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 21,68,500 విలు వగల సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి కొప్పుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపద ఉన్న సమయంలో పేదలకు ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారని, వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచిపోతారన్నారు. అనంతరం మండలంలోని గోపాల్‌రావుపేట, మేడారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీఓ జయాశీల, మార్కెట్ కమిటీ- చైర్మన్ బుచ్చిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రాచురి శ్రీధర్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.