పెద్దపల్లి : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భంధులా మారుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 156 మంది లబ్ధిదారులకు రూ. 54,30,200ల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నిరంతరం పేద ప్రజల కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆపదలో ఉన్న సమయంలో వైద్యం కోసం పేదలకు సీఎం సహాయనిధి ఆర్థికంగా ఎంతో భరోసా ఇస్తుందన్నారు. అనారోగ్యానికి గురైన, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement