ఎల్లారెడ్డిపేట: వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గత సంవత్సరంలాగే ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి రైతు పక్షపాతిగా నిరూపితమైందని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్‌గౌడ్ పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండు వేసవిలో సిరిసిల్ల వరప్రదాయిని అయిన ఎగువ మానేరును కాళేశ్వరం జలాల ద్వారా నింపి సిరిసిల్ల రైతాంగానికి మరోసారి తమది రైతు ప్రభుత్వమని నిరూపించారన్నారు. మండల రైతుల తరపున సీఎం నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ- డైరెక్టర్ ముత్యాల శేఖర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలరాజ్ నర్సాగౌడ్, లంబ సత్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement