Tuesday, November 26, 2024

స్వచ్ఛ పట్టణం మహిళల చేతుల్లోనే : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

స్వచ్ఛ పట్టణంగా పెద్దపల్లిని మార్చడం మహిళల చేతుల్లోనే ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అమర్‌చంద్‌ కళ్యాణం, సిరి ఫంక్షన్‌ హాల్‌, ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌, నందన గార్డెన్స్‌, ఎంపీడీఓ సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షన్‌ భాగంగా పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో తడి, పొడి చెత్తపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణ ప్రజలంతా పరిశుభ్రతకు సహకరించేలా మహిళలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్ఛ పట్టణంగా పెద్దపల్లిని తీర్చిదిద్దడంలో మహిళలు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దాసరి మమతరెడ్డి, వైస్‌ చైర్‌ పర్సన్‌ నజ్మీన్‌ సుల్తానా ముబీన్‌, కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు ఇల్లందుల కృష్ణమూర్తి, మాధవి, చంద్రశేఖర్‌, పైడ పద్మ, దేవనంది రమాదేవి, మెప్మా ఆర్పీలు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, వార్డుల మహిళా అధ్యక్షురాలు, మహిళలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement