Tuesday, November 19, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని గ్రామాలలో శాంతి భద్రతలను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తానని సిఐ కే. మొగిలి తెలిపారు. ఎల్లారెడ్డిపేట సిఐ గా బదిలీపై వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తూనే, చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిషేధిత గుట్కా, గంజాయి, బెల్లం విక్రయాలను అరికడతామని, సేవించే, విక్రయించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా దారులతోపాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినా, దొంగ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరిం చి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని సిఐ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement