Sunday, November 3, 2024

Peddapalli: బాలల సంరక్షణ కార్యక్రమాలు అమలు చేయాలి.. కలెక్టర్

పెద్దపల్లి, ప్రభ న్యూస్ : జిల్లాలో బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మిషన్ వాత్సల్య కార్యక్రమ అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత మహిళా శిశు దివ్యంగా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాలోని వివిధ సీసీఐలలో 6వ తరగతి చదువుతున్న పిల్లలందరినీ ఎంపిక చేసి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మీషన్ ఇప్పించాలన్నారు. జిల్లాలో ఉన్న అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లల్లో స్పాన్సర్షిప్ కు అర్హులైన పిల్లలను గుర్తించి, వారి వివరాలు సేకరించాలన్నారు.

జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని, జిల్లాలో ఎక్కడా చట్ట వ్యతిరేక దత్తతలు జరగకుండా సంబంధిత ప్రకృతి ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ బాలల పరిరక్షణ కమిటీలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, బాలలపై జరిగే లైంగిక దాడులను నివారించేందుకు సంబంధిత వ్యవస్థలతో సమయం చేసుకుని పని చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, మిషన్ వాత్సల్య స్కీమ్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement