ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దేశంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశంలో అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement