జగిత్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా జగిత్యాలలో పలు చోట్ల చిరుత సంచారం చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. గురువారం రాయికల్ మండలం వస్తాపూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి పొలం పనులకు వెళ్లిన రైతులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారాన్ని ప్రవీణ్ అనే రైతు వీడియో తీశాడు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం సమయంలో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement