Saturday, November 23, 2024

స్వరాష్ట్రంలో మారిన పల్లెల రూపురేఖలు : మంత్రి గంగుల

ప్రజల మనసు చూరగొనెలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సమైక్య పాలనలో పల్లెలకు రహదారులు కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడే వారని కానీ నేడు స్వయంపాలన లో కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులతో పల్లెల రుపు రేఖలు మారిపోయయాని అన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలో పెండింగ్ పనులన్నింటి కోసం 16 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని ..ఈ పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారని, కేసీఆర్ తోనే తమ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.

పల్లెల్లో నేడు ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని.. కెసిఆర్ ను మరోసారి దీవించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు బిజెపి కాంగ్రెస్ లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని గతంలో తమల్ని పాలించిన ఈ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే చీకటి రోజులు మళ్లీ వస్తాయని ప్రజలకు తెలుసని..అందుకే వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

- Advertisement -

ప్రజా ప్రతినిధులు జవాబుదారీగా పనిచేయాలని సమస్యలు అనేవి లేకుండా ఉండవని వాటిని అధిగమించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. తెలంగాణలో సంపద పెరగాలని పెరిగిన సంపదను పంచాలని నిర్ణయించి నేడు కోట్ల రూపాయలతో పల్లెలకు కొత్త రూపు తీసుకువచ్చి ప్రజాజీవన ప్రమాణాలు పెంచడం జరిగిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారని ఈరోజు కాకుండా రేపైనా కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని నమ్మకంతో ప్రజలు ఉన్నారని ..అభివృద్ధిని కొనసాగించాలని కోరుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో వీర బుచ్చయ్య,ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, జెడ్పీటీసీ పురమల్ల లలిత, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపిడిఓ జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement