బీసీ సంక్షేమ, పౌరసరాపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్ష నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, గౌరవ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నగర కమిటీ సభ్యులను మంత్రి శాలువాతో సన్మానించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement