Tuesday, November 26, 2024

TS: బీఆర్ఎస్ లో చైతన్య కు సరైన స్థానం కల్పిస్తాం.. కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటదని, భవిష్యత్తులో చైతన్య కు సరైన స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్ లో ఉద్యమ నాయకుడు శాతవాహన యూనివర్సిటీ జేఏసీ (ఫౌండర్) చైర్మన్ చెన్నమల్ల చైతన్య మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ‌చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ… కేసీఆర్, కేటీ రామారావు మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు క్రమశిక్షణ గల నాయకుడిగా తెలంగాణ అభివృద్ధికి పార్టీ కోసం పార్టీ నాయకత్వం అప్పజెప్పిన ఏ బాధ్యత అయినా స్వీకరించి అహర్నిశలు కృషి చేస్తూ పనిచేస్తానన్నారు.

పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని, అలాగే దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పుంఖాను పుంఖాలుగా పరిడవిల్లడం విద్యా, వైద్య వ్యవసాయ, సాంకేతిక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన దానిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్రనే సింహభాగమని, అందుకోసమే దాదాపుగా తనతోపాటు 50మందికి పైగా విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, అలాగే ఇంటిలాంటి ఉద్యమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శాతవాహన విద్యార్థుల పాత్ర కీలకమైందని, అందులో చెన్నమల్ల చైతన్య పాత్ర తెలంగాణ ప్రాంతం మర్చిపోవద్దని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి ఏకంగా ఆరు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడని ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలతో పాటు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అడ్డా పోరాటాల గడ్డగా అహింసాయుతంగా, శాంతియుతంగా అనేక రూపాల్లో ఉద్యమ కార్యక్రమం ముందుకు నడిపించారన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటదని భవిష్యత్తులో చైతన్యకు సరైన స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -


కేటీ రామారావు, ఓయు జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ ల సమక్షంలో చేరిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు శనిగరం అరుణ్ కుమార్, గడ్డమీద రాజశేఖర్, గడ్డమీది రాకేష్, ముల్కల విజయ్, KU జేఏసీ నాయకులు సూర రాము యాదవ్, నంగునూరు చంద్రశేఖర్ బసవరాజు అభిలాష్ ,బండ అశోక్ తదితరులు చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement