Friday, November 22, 2024

రాజిరెడ్డికి సీపీఐ నేత చాడ నివాళి

చిగురుమామిడి: మండలంలోని సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకులు, రైతు సంఘం జిల్లా నాయకులు గోలీ రాజిరెడ్డి ఇటీ-వల అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌ కుమార్‌, మాజీ జడ్పీటీ-సీ, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, సీతారాంపూర్‌ సర్పంచ్‌ గోలి బాపురెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు అందే చిన్న స్వామి, తేరాల సత్యనారాయణ, బూడిద సదాశివ, మాజీ జడ్పీటీ-సీ ఆలేటి రాజిరెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్స్‌ చాడ శ్రీధర్‌రెడ్డి, ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల కన్వీనర్‌ కాంతాల శ్రీనివాస్‌ రెడ్డి, సీపీఐ నాయకులు జనార్దన్‌, కయ్యం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement