వేములవాడ: కోనరావుపేట మండల సెస్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా ఇవ్వడంలో మాత్రం విఫలమైందని ఆరోపించారు. కరెంటు లేక నీళ్లు ఇవ్వక పోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని, గంటకి నాలుగైదు సార్లు కరెంటు పోతుందన్నారు. పంట పొలాలు చేతికొచ్చే దశలో ఉండి, ఎండిపోతున్నందున వెంటనే స్పందించి తక్షణమే రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సెస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, ఎంపీటీ-సీ ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బుర్ర రవీందర్, మండల నాయకులు గడిపెల్లీ ఎల్లయ్య యాదవ్, బోయిని దేవరాజు, గ్రామ అధ్యక్షులు లంబ రాజు, మందాల లింబయ్య, భూమేష్, ముద్దం సత్యం, రాస రవీందర్‌రెడ్డి, వంగపల్లి శోభన్, నిత్యానందం, అనిల్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement