పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10(ప్రభ న్యూస్): గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పెద్దపల్లి ఎస్సై రాజేష్ తెలిపారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మండలంలోని సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఎస్సై మాట్లాడారు. నేరాలు జరిగితే ఆసంఘటనలకు సంబంధించి వివరాలు తెలిపేందుకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమన్నారు. సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించబడ్డాయని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. నేరాల నియంత్రణలో ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు సహకరించాలని అవగాహణ కల్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ రాజు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement