Friday, November 22, 2024

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్

కాల్వశ్రీరాంపూర్‌: ప్రజల శాంతిభద్రతల సంరక్షణ కోసమే గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్‌ సిఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మొట్లపల్లి గ్రామంలో స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సోదాలు నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనపర్చుకున్నారు. కిరాణా షాపులు బెల్ట్‌ షాపుల్లో అక్రమ మద్యం నిల్వలపై దాడులు నిర్వహించారు. గ్రామాల్లో అపరిచితులు, సంఘ విద్రోహ శక్తులు తారసపడితే వెంటనే పోలీస్‌ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో నడుచుకొని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలన్నారు. మావోయిస్టులు అడవి బాట విడిచి జన జీవన స్రవంతిలో కలిసి కుటు-ంబ సభ్యులతో ఆనందమైన జీవనాన్ని గడపాలన్నారు. కుటు-ంబ సభ్యులు, తల్లిదండ్రుల బాగోగులు చూడని మావోయిస్టులు సమాజం కోసం ఏం సేవ చేస్తారన్నారు. అడవి బాట విడిచి పల్లె పాట పట్టిన వారికి ప్రభుత్వం నజరానాతోపాటు- సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అలాగే వాహనదారులు ప్రయాణ సమయంలో ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. పోలీసులు ఎల్లప్పుడు అండగా ఉంటారని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గోనె శ్యామ్‌, ఉప సర్పంచ్‌ మల్లేశం, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, చంద్రకుమార్‌, ఉపేందర్‌, ప్రొబేషనరీ ఎస్‌ఐలు అపూర్వ, విజయ్‌, సోమేశ్‌, రాజు, నరేష్‌, సైదారావు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్‌. పోలీస్‌ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement