Wednesday, November 20, 2024

Peddapalli: కారు జోరుతో ప్రతిపక్షాలు బేజారు.. దాసరి ప్రశాంత్ రెడ్డి

కాల్వ శ్రీరాంపూర్, (ప్రభ న్యూస్) : నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్ష పార్టీలు బేజార్ అవుతుయన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, సంక్షేమమైనా, అభివృద్ధి చేయడమైనా బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో ఎలా అమలు చేస్తారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందడంతో పాటు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 అందుతాయని, ఆసరా పింఛన్లను ఐదువేలకు పెంచుతామని, వికలాంగుల పింఛన్లను ఆరువేల రూపాయలకు పెంచుతామన్నారు.

గ్యాస్ సిలిండర్ ను 400 రూపాయలకే అందిస్తామని, రైతు బంధును 16 వేల రూపాయలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మూడు గంటలు కరెంటు వస్తుందని, కారు గుర్తుకు ఓటేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండా రెపరెపలాడేలా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీపీ సంపత్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement