పెద్దపల్లి నియోజక వర్గంలోని చివరి భూములకు ఎస్సారెస్పీ కాల్వ నీళ్ళు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. గురువారం
ఓదెల మండలంలోని గుంపుల చివరి భూములకు కాల్వ నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలోని డి86 కెనాల్ వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉపసర్పంచ్,మండల బీఆర్ఎస్ యూత్ నాయకుడు గట్టు మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ నీరు వారాబంది పద్ధతిలో సరఫరా జరగడంతో కాలువ నీరందుక పంటలు ఎండిపోతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధికారులతో మాట్లాడి 15 రోజులపాటు నిరంతర నీటి సరఫరాకు ఒప్పించి నీటిని విడుదల చేశారన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఏ శాసనసభ్యులు చేయని విధంగా దాసరి మనోహర్ రెడ్డి నిరంతరంగా ఈ నెల 24 వరకు కాలువ నీళ్లు వచ్చేలా కృషి చేసినందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని పెద్దపల్లి ప్రజల శ్రేయస్సు కోసం రైతుల పంట పొలాలు ఎండకుండా చూసినటువంటి దాసరి మనోహర్ రెడ్డిని మూడోసారిగా ముచ్చటగా పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదా రెడ్డి రాజుల కిషన్, యూత్ అధ్యక్షుడు బొమ్మక నరేష్, వార్డు సభ్యులు మరి కుమార్, గాధం శీను, చందర్రావు, సాగర్ల లింగన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
చివరి భూములకు కాలువ నీళ్లు.. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం..
Advertisement
తాజా వార్తలు
Advertisement