Saturday, November 23, 2024

మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు.. ఎమ్మెల్యే దాసరి

రైతాంగం కష్టపడి పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మవద్దని, వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ సదయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య, ఉప సర్పంచ్ హైమావతి, డైరెక్టర్ మేకల కుమార్, నాయకులు ధర్మపురి, బండి సతీష్, మేకల కిట్టు, పుదరి శ్రీనివాస్, బయ్య కొమురయ్య, దామ కనకయ్య, నగేష్, హరీష్, శంకర్, రామస్వామి, వైకుంఠం, మల్లయ్య, సుధాకర్ రావు, శ్రీనివాసరావు, తిరుపతి రావు, రైతులు, గ్రామ పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement