Friday, November 22, 2024

ఈడీ సోదాలకు నిరసనగా ధర్నా.. మోడీ దిష్టిబొమ్మ దహనం..

పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో మున్నూరు కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో రాజీవ్ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ పేరిట సోదరులు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించగానే మోడీ, అమిత్ షాల్లో వణుకు మొదలైందని, కక్ష సాధింపు లో భాగంగానే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్, సరేష్, వివేక్ పటేల్, రామస్వామి,శ్రీదర్, రామ్మూర్తి, సురేందర్ పాల్గొన్నారు.

ఈడీ సోదలకు నిరసనగా ధర్నా
ఈడీ సోదలను నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ లో మున్నూరు కాపు సంగం ధర్నా నిర్వహించి ప్రధాని మోడీ
దిష్టి బొమ్మ దహనం చేశారు. జిల్లా మున్నూరు కాపు సంఘము ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర ఇండ్లలలో ఈడీ, ఐటీ దాడులులను కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం తీవ్రంగా ఖండించింది.
కక్ష పూరితంగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల ఎదుగుదలను ఓర్వలేని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈనెల 12వ తేదీ రామగుండంకు వచ్చే నిన్ను యావత్ తెలంగాణ మున్నూరు కాపులం ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ , మున్నూరు కాపు కార్పొరేటర్లు, మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, మున్నూరు కాపుసంఘం ప్రధాన కార్యదర్శులు, మున్నూరు కాపు నాయకులు, మున్నూరు కాపు పెద్దలు ,మున్నూరు కాపు కుల బాంధవులు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement