ఎలిగేడు, సెప్టెంబర్ 20 (ప్రభన్యూస్): కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త దుర్గం త్రిమూర్తి ఇటీవల మరణించగా, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాదబీమా ద్వారా మంజూరైన రూ. 2లక్షల విలువ గల చెక్కును రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం కార్యకర్త తండ్రి నర్సయ్యకు ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కార్యకర్తలను, వారి కుటుంబాలను కంటికి రెప్పలా పార్టీ కాపాడుకుంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు నిరంతరం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. త్రిమూర్తి గతంలో మరణించగా, పార్టీ సభ్యత్వం ఉన్న దృష్ట్యా రూ.2లక్షల బీమా వర్తించడంతో ఆపద సమయంలో వారి కుటుంబానికి చెక్కును అందజేశామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక రాజనర్సు, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాడ కొండాల్ రెడ్డి, సర్పంచ్ గోపు విజేందర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రేమలత కమలాకర్ రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు కప్పల ప్రవీణ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు పెద్ది సమ్మయ్య, న్యాతరి పోచాలు, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడుగుల మహేందర్, రాజకొమురయ్య, మడ్లపెల్లి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, ఇరుగురాల తిరుపతి, కవ్వంపెల్లి అనిల్, అనిల్ కుమార్, బాసంపెల్లి వినోద్, సిద్ది తిరుపతి, పున్నం మధు, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, కిట్టు, బన్నీ, విజయ్, సందీప్ రెడ్డి, చంద్రయ్య, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.