Friday, November 22, 2024

ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు 1,03,11,948 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా కూడా కల్యాణ లక్ష్మి పథకం లేదన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడమే తమ పనితీరుకు నిదర్శనం అని, బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రైతుబంధు, రైతు బీమా ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ బండారి స్రవంతిశ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానామోబిన్,కౌన్సిలర్ లు,ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు,యూత్ అధ్యక్షులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement