భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ కాదని కార్పొరేట్ పార్టీ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కు తొత్తుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రావడమే తమ ప్రభుత్వ పనితీరుని నిదర్శనం అన్నారు. తెరాసకు తెలంగాణలో ఏ పార్టీతో పోటీ లేదని రాబోయే ఎన్నికల్లో వంద స్థానాలు సాధిస్తామన్నారు. 2014లో 63, 2018లో ఎనభై ఎనిమిది స్థానాలు సాధించామని వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు సాధించి తెరాస ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..