ప్రతి గుండెల్లో భారతీయత నిండేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎంతో ఘనంగా చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఎంతోమంది త్యాగధనుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేపట్టడం జరుగుతుందని చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు నిర్వహణ కోసం ముప్పై రెండు మందితో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.
కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యవహరించనుండగా, వైస్ చైర్మెన్ గా మేయర్ బంగి అనిల్ కుమార్, కన్వీనర్ గా డిప్యూటి మేయర్ నడిపి అభిషేక్ రావు, కో కన్వీనర్ గా పి.టి.స్వామి, సభ్యులుగా కొంకటి లక్ష్మీనారాయణ, తోడేటి శంకర్ గౌడ్, పాతిపల్లి ఎల్లయ్య, నారాయణ దాసు, మారుతి, చల్ల గురుకుల మెగిళి, పర్లపల్లి రవి, జేవీ రాజు, అడ్డాల రామస్వామి, దీటి బాలరాజు, కుమ్మరి శ్రీనివాస్, తానిపర్తి గోపాల్రావు, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్, ఎండీ రఫీక్, జావేద్ పాషా, సాగంటి శంకర్, తిరుపతినాయక్ పెంట రాజేష్, మేడి సదయ్య, బొడ్డు రవీందర్, చిలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, మేకల పోశం నూతి తిరుపతి, అచ్చే వేణు, మండ రమేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, చిప్ప రాజేష్ లను ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ విలేఖరుల సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, బాల రాజ్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, నాయకులు పి.టి.స్వా తోడేటి శంకర్ గౌడ్, బోడ్డు రవీందర్, నీల గణేష్, పోన్నం లక్ష్మన్, తానిపర్తి గోపాలరావు, నారాయణదాసు, మారుతి దీటి బాలరాజు, పీచర శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, మేడి సదయ్య, నూతి తిరుపతి, తోకల రమేష్, పిల్లి రమేష్ జడ్సన్, ఇరుగురాళ్ల శ్రావన్, నీరటి శ్రీనివాస్, బంధే నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.