Friday, November 22, 2024

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో 15 వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఒక కోటి 56 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న అన్నారు. గ్రామీణ ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలందించేందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, రైతు సమితి జిల్లా డైరెక్టర్ బుచ్చిరెడ్డి, ఆకుల మహేందర్, సర్పంచ్ సామ మణెమ్మ-శంకర్, ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, నాయకులు బండారి ఐలయ్య, పోతర్ల శ్రీనివాస్, సాతురి రవి, సాతురి రాజేశం, మద్దెల నర్సయ్య, శ్రీనివాస్, దొడ్డే శంకర్, సర్పంచ్ లు పల్లె ఓదెలు, గుండేటి మధు, కర్క మల్లారెడ్డి, ఎంపీటీసీ లావణ్య – గోపు నారాయణ రెడ్డి, బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement