Wednesday, November 20, 2024

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి… సీపీ రెమా రాజేశ్వరి

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల జోన్ చెన్నూర్ మండలం, బతుకమ్మ వాగు వంతన సైడ్ వాల్ మరమ్మత్తు పనులు, కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అన్నారం సరస్వతి బ్యారేజ్ లను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతిని పరిశీలించారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ముందస్తుగా తరలించాలన్నారు.

పట్టణంలోని చెరువులు, వివిధ ప్రాజెక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించి, నిఘా ఉంచాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ అధికారులను ఆదేశించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపీఎస్, జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసు దేవా రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యా సాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement