సుల్తానాబాద్: మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఐ ఉపేందర్ హాజరై సాంఘీక దురాచారాలు, ఆ్లనన్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణతోపాటు మహిళలకు వివిధ చట్టాలపై వివరించారు. గ్రామీణ ప్రజలు మారుతున్న సమాజానికి అనుగుణంగా మార్పు చెందాలని కోరారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఆవశ్యతను వివరిస్తూ ఏర్పాటు కోసం స్వచ్చందంగా ముందుకురావాలని దాతలను కోరారు. కళాబృందం సభ్యులు తమ ఆటపాటల ద్వారా చైన్యవంతం చేశారు. ఈకార్యక్రమంలో పోలీస్ కళ బృందం సభ్యులు, సర్పంచ్, ఎంపిటిసి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement