Tuesday, November 26, 2024

నైతిక విలువల పై అవగాహన కల్పించాలి.. కరీంనగర్ సీపీ సత్యనారాయణ

సమాజంలో నైతిక విలువలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని, విద్యార్థులకు వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి కలిసి స్థానిక కొత్తపల్లి లోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఎతికల్ కెరియర్ గైడెన్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు నైతిక విలువలు అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని మరియు లక్ష్య సాధనకై శ్రమంచి విజయాలను నమోదు చేసి ఖ్యాతి ఘడించాలని చెప్పారు. సమాజంలో వెలువడుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు విద్యార్థులకు భోదన అందిస్తున్నారని అదే రీతిలో వారికి నైతిక విలువల పట్ల విసృత అవగాహన కల్పించాలని కోరారు. నైతిక విలువలతో కార్యకలాపాలు చేపట్టిన వారికి విజయాలు వెంబడిస్తాయని మరియు ఉత్తమ స్థానాలను చేకూర్చుందని అభిప్రాయపడుతూ పురాతన కాలంలో నైతిక విలువలకు ప్రత్యేక చోటు ఉన్నదని తెలిపారు.

వాటిని ఎప్పటికప్పుడు విశ్లేషించి అమలుపర్చినట్లైతే విశేష ఫలితాలు పొందుతామని చెప్పారు. సమాజంలో చోటు చేసుకునేటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మరియు మోస పూరిత సంఘటనలకు అడ్డుకట్ట వేయచ్చునని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.అల్ఫోర్స్ విద్యాసంస్థలు నైతిక విలువలకు పర్యాయపదం అని మరియు అధినేత నరేందర్ రెడ్డి గారు విలువలతో కూడిన విద్యను అందించడం గొప్ప విషయమనీ, ప్రతిఒక్కరు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిస కావద్దని మరియు మబైల్ ఫోన్ల వాడకాని తక్కువ చేసుకొని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement