ముత్తారం: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వరిధాన్యం నాణ్యత ప్రమాణాలు, కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హార్వెస్టర్ల యజమానులు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంటల కోత సమయంలో వరిధాన్యం కోత సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ ఆన్ చేసి వేగం 18 నుంచి 19 ఆర్పీఎం ఉండేలా చూసుకోవాలన్నారు. తద్వారా ధాన్యం తాలు, తప్ప వచ్చే అవకాశం ఉండదన్నారు. అలాగే రైతులు ధాన్యం నాణ్యత ప్రమాణాలలో తేమశాతం 17, మట్టిపెల్లలు 1, తాలు 1, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5, పూర్తిగా తయారు కాని ధాన్యం 3, మిశ్రమ రకము 6శాతంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, సింగి ల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ పోతుపెద్ది రమణారెడ్డి, ఓడేడ్ ఎంపీటీసీ పోతుపెద్ది కిషన్రెడ్డి, సర్పంచ్లు తూటి రజిత రఫీ, సంపత్రావు, సతీష్, గాదం స్రవంతి శ్రీనివాస్, ఏఓ శ్రీకాంత్, డీటీ సత్యనారాయణ, ఏఈఓలు సాయివర్మ, మౌనిక, హారిక, రైతు కన్వీనర్లు చల్ల సమ్మయ్య, పాపారావు, బర్ల కొమురయ్య, పందుల వెంకటేశం, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement