Monday, November 25, 2024

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి..

పెద్దపల్లి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని లయన్స్‌ క్లబ్‌ పెద్దపల్లి ఎలైట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌ కోరారు. క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించి జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి వీలైనంత వరకు ప్లాస్టిక్‌ను తగ్గించాలని, తద్వారా పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక ్టర్‌ దాసరి మమతరెడ్డి, కమిషనర్‌ తిరుపతిల పిలుపు మేరకు ప్లాస్టిక్‌ రహిత పెద్దపల్లి కోసం తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ జైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్‌, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement