భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి, బండి సదానందం, పనాస రాజేందర్, కారుకూరి రాజేశం,తిలక్, శ్రీనివాస్, లచ్చయ్య, రవీందర్, రాజేశం, వీరయ్య, శ్రీనివాస్,మోగిళి, ప్రశాంత్, లింగయ్య, బుచ్చయ్య, మధుకర్, మొండయ్య, రవి, రవీందర్, సమ్మయ్య, బాలమల్లు, ప్రేమయ్య,రాజయ్య, వెంకటేష్, సతీష్, కిరణ్, నరేష్,రవి చందు లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో గులాబీ దండులోకి చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, పీఏసీ ఛైర్మెన్ గజావెల్లి పురుషోత్తం, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవేందర్, కన్వీనర్ మెడుదుల రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ వెలుతురు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ బీసగోని రమేష్, కరబూజ శ్రీనివాస్,బండి రమేష్, తమ్మిశెట్టి నాగభూషణం, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.