Saturday, September 21, 2024

ఆరోగ్య కేంద్రంలో దారుణం.. పోస్టుమార్టనికి 15వేలు డిమాండ్ చేసిన వైద్యులు..

ఉదయగిరి, ప్రభన్యూస్ : ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న వలస కూలి పోస్టుమార్టం నికి ఉదయ్కిరణ్ సామాజిక ఆరోగ్య వైద్యుడు డాక్టర్ సంధాని భాషా రూ 15 వేలు డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అడ్డంగా దొరికిపోయాడు. వరికుంటపాడు ఎస్ఐ మహేంద్ర నాయక్ తెలిపిన వివరాల మేరకు వెస్ట్ గోదావరి జిల్లా నుండి బ్రతుకుతెరువు కోసం వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి కుటుంబంతో కలిసి వలస వచ్చిన ఇరకం ముదిరాజు దంపతులు మండల పరిధిలోని తూర్పు కొండ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బత్తాయి తోటకు గత కొన్ని రోజులుగా కాపలాగ పని కుదుర్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కారణంగా మంగళవారం అర్ధరాత్రి మనస్థాపానికి గురై ఇరకం ముదిరాజు 25 ఉరి వేసుకొని మృతి చెందారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండగా అర్ధరాత్రి తలుపులు వేసుకొని ఫ్యాన్ కు ఉరివేసుకొని ముదిరాజు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంట్లో నుంచి ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపులు పగలగొట్టిన భార్య మునిశ్వరి అప్పటికే మృతి చెందిన ముది రాజు, పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మహేంద్ర నాయక్ సంఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉదయగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సంధాని భాష రూ.15 వేలు, అటెండర్ కి మరో వెయ్యి రూపాయలు ఫోన్ పే చేస్తేనే పోస్టుమార్టం నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తెల్లకాగితంపై ఫోన్ పే నెంబర్ రాసిచ్చారు. దీంతో కంగుతిన్న మృతుని భార్య మునేశ్వరి మా వద్ద అంత డబ్బులు లేవని, బ్రతుకుదెరువు కోసం వలస కూలీలుగా వెస్ట్ గోదావరి జిల్లా,ఈ బట్టాయి గూడెం మండలం, వేఫులపాడు గ్రామం నుంచి బ్రతుకుదెరువు కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చామని, తమ వద్ద రూ 8 వేలు నగదు ఉన్నాయని, అవి తీసుకుని పోస్టులు భర్తీ చేయాలని ఎంతో దీనంగా వేడుకున్నప్పటికీ ఆ కరెక్ట్ వైద్యుడు స్పందించకపోవడంతో అక్కడే ఉన్న యువకులు కొందరు తమ చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడంతో డాక్టర్ సంధాని భాషా పలాయనం చిత్తగించారు. చెప్పినను వినని డాక్టర్ తాము వెస్ట్ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వేపులపాడు గ్రామం నుంచి బతుకుదెరువు కోసం వచ్చామని బాధితురాలు మునీశ్వరి వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఉదయగిరి సామాజిక సామాజిక ఆరోగ్య కేంద్రం పై విచారణ జరిపించి వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement